- Advertisement -
సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం తంతిరం. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రమిది. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో ఆసక్తి రేకెత్తించేలా టీజర్ ఉంది. 82 సెకండ్లు ఉన్నాయ్ టీజర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలియజేశారు దర్శక నిర్మాతలు.
Also Read:నమ్మాలా, వద్దా?.. మీమాంశలో అల్లు అర్జున్
- Advertisement -