ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది..

46
mohan babu
- Advertisement -

డైలాగ్ కింగ్ మోహన్‌ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది…ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ, స్వామీ.. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. నేను దాన్నే ఫాలో అవుతున్నా (మోహన్‌బాబు) పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది (తనికెళ్ల భరణి), నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీతో పాటు 138 కోట్ల ఇండియన్స్‌కి చాలా డీటైయిల్డ్‌గా చెబుతాను అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

- Advertisement -