మహేష్ 28లో సీనియర్ హీరోయిన్!

79
mahesh
- Advertisement -

సర్కార్ వారి పాట తర్వాత మహేష్ బాబు…త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలె ప్రారంభంకాగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

మహేష్ కెరీర్‌లో ఇది 28వ సినిమా కాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ తల్లిగా రాధ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సీనియర్ హీరోయిన్ రాధని కలిసి కథ చెప్పినట్టు, ఆమె ఓకే చేసినట్టు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం మహేష్ నటించిన సర్కార్ వారి పాట సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -