గుడిలో జమ్మిచెట్టు.. అపూర్వ స్పందన

35
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి అటవీ,దేవాదాయ శాఖలు అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు శ్రీ హనుమాన్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సనతనగర్ దేవాలయ ప్రాంగణంలో*దేవాలయ కార్యనిర్వహణాధికారి ఇ శ్రీనివాస రాజు ఆదేశాల మేరకు అర్చకులు సిబ్బంది పాల్గొని జమ్మిచెట్టు నాటడం జరిగింది…

గొర్రెకుంట శ్రీ కట్ట మల్లన్న స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈఓ అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మిచెట్టు నాటడం జరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జమ్మి చెట్టు నాటడం జరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమరంశ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ ఓ నరేందర్ రెడ్డ్,ఆలయ అర్చకులు జరుపుల రాంసింగ్ ఇతర సిబ్బంది తో కలిసి జమ్మిచెట్టు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతలో నాటిన చెట్టు పెరిగి పెద్దదైందని మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొని జమ్మిచెట్టు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఈ ఓ శ్రీనివాస్, అర్చకులు కలిసి జమ్మిచెట్టు ను నాటారు.శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ ఓ ,సిబ్బంది కలిసి జమ్మిచెట్టు నాటారు.మంచిర్యాల శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం ప్రాంగణంలో జమ్మిచెట్టు ను నాటారు ఆలయ అర్చకులు.

తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం.జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఎంపీ సంతోష్ కుమార్ తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నామని ఈఓ లు, అర్చకులు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -