‘దోచేవారేవారురా’.. అనూహ్య స్పందన

102
- Advertisement -

ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోచేవారేవారురా!” ఈచిత్రం లోని ” కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ.. పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేసారు.

కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి వచ్చి.. సాంగ్ లాంచ్ చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్ రావటానికి నా ఫ్రెండ్ మరియు దర్శకుడు శ్యాం గారు కారణం. నేను కన్నడ చిత్రం నిర్మించాను. దానికి దర్శకుడు శ్యాం గారు అని తెలిపారు.

శివనాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…మహిళలస్వేచ్ఛ గురించి వచ్చే ఈ పాటకు కాలేజ్ స్టూడెంట్స్ లో మంచి స్పందన వచ్చింది..డాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు.. కాలేజ్ లో పాట ను విడుదల చేసినందుకు మలినేని పెరుమాళ్ళు గారికి చాలా కృతజ్ఞతలు.. విడుదల చేసిన పాటకు ..విద్యార్థిని లకు సింగిగ్ , డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. బాగా పాడిన వాళ్లకు. డాన్స్ చేసిన వాళ్లకు నా నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ ఇస్తాను.. కామెడీ. త్రిల్లర్ తో పూర్తి వినోదం గా సాగే ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. త్వరలో విడుదల తేది ని ప్రకటిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -