త్రిష పెళ్లి పై మళ్లీ పుకార్లు !

181
- Advertisement -

మాజీ క్రేజీ హీరోయిన్ త్రిష పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం త్రిష మళ్ళీ నటిగా బిజీ అయింది. వరుస సినిమాలు చేస్తోంది. పైగా ఆమెకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. దాంతో ముదురు వయసులో కూడా అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా ఈ పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? త్రిష గత కొన్ని రోజులుగా చెన్నైకు చెందిన ఓ బిజినెస్ మేన్ తో చనవుగా ఉంటుందట. దాంతో అతన్నే త్రిష పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు.

దాంతో ఈ బ్యూటీ తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెట్టింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని, తనకు 40 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ త్రిష చెప్పుకొచ్చింది. అయితే, తాను ప్రస్తుతం ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి ప్రధాన కారణం అతని మనసు చాలా మంచిది అట. ఏమైనా త్రిష వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది. అలాగే ఆమె మనసు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని త్రిష గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.

పైగా త్రిష ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య ఒక తెలుగు హీరోతో త్రిష ప్రేమలో పడింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ యువ నిర్మాత ను ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్లీ ఓ బిజినెస్ మేన్ తో ప్రేమలో పడింది. త్రిషకి ఉన్న మరో మంచి లక్షణం ఆమె చాలా బోల్డ్. ప్రేమ తాలూకు చేదు విషయాలను ఆమె ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -