వేసవిని మించిన విద్యుత్ డిమాండ్..

52
- Advertisement -

వేసవి కాలాన్ని మించింది వద్యుత్ డిమాండ్. ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఇవాళ వానాకాలం లో 14136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని ట్రాన్స్‌ కో, జేఎన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వానాకాలం లో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం అన్నారు.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, రాష్ట్రంలో భారీగా వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్ కు తగ్గట్లుగా ఎక్కడ కూడా అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గత సంవత్సరం ఇదే రోజు 12251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందన్నారు.

రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉండడం దాదాపు 37 నుండి 40 శాతం విద్యుత్ వినియోగం అవుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రంగం విద్యుత్ వాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. ఎంత డిమాండ్ వచ్చిన వ్యవసాయ రంగంకు,అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.

Also Read:ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -