ఆరు మండలి స్థానాలు టీఆర్ఎస్‌కే ..

104
kcr
- Advertisement -

రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశావాహులు భారీ సంఖ్యలో ఉండగా సామాజికవర్గం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని అవకాశం కల్పించనున్నారు సీఎం కేసీఆర్. ఇక ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటెడ్‌ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలుండగా టీఆర్ఎస్‌కు 104, మజ్లిస్‌ 7, కాంగ్రెస్‌ 6, బీజేపీకి 2 ఉన్నాయి.

ప్రస్తుత బలాబలాల ప్రాతిపదికన చూస్తూ మొత్తం ఆరు స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికార పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఆశావాహుల్లో ప్రధానంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి,మహిళా కోటా, ప్రధాన సామాజికవర్గం కోటాలో ఆకుల లలిత, నేతి విద్యాసాగర్‌, మైనారిటీల కోటాలో ఫరీదుద్దీన్‌‌లు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.వీరితో పాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్‌, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, నందకిశోర్‌ వ్యాస్‌ బిలాల్‌, మాజీ ఎంపీ సీతారామ్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

నవంబర్ 2 హుజూరాబాద్‌ ఫలితం వెలువడిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -