పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి 2898 AD’ పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైప్ మామూలుగా లేదు. అయినా ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు థియేటర్ డీల్స్ పూర్తి కాలేదు. ఇలాంటి భారీ సినిమా మొదలు కాకముందు నుంచే డిమాండ్ ఉంటుంది. రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడతారు. కానీ ఇప్పటివరకు ఏపీ, తెలంగాణాలో ఎవరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటూ ముందుకు రాలేదు. దానికి కారణం.. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అడుగుతున్న రేట్లు. ఇంతకుముందు దిల్ రాజు “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి 60 కోట్లు పెట్టి తెలంగాణ (నైజాం) హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఇప్పుడు “ ‘కల్కి 2898 AD”కి ఈ నిర్మాత 110 కోట్లు అడుగుతున్నారట. దిల్ రాజు 85 కోట్లు ఇవ్వగలను అని అంటున్నారట. అందుకే ఇంకా ఈ సినిమా బిజినెస్ డీల్ పూర్తి కాలేదు. ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి. “ఆర్ ఆర్ ఆర్ ” సినిమాకి మించి రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. కానీ ప్రభాస్ గత మూడు చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఆది పురుష్ కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు.
Also Read:Telangana Congress:ఫస్ట్ లిస్ట్ లీక్!
ఐతే, ‘కల్కి 2898 AD” సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై చాలా క్రేజ్ ఉంది. దీనికితోడు ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హాలీవుడ్‌కు ధీటైన గ్రాఫిక్స్ హంగులతో విజువల్ ఫీస్ట్‌గా ఈ ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను మెస్మరైజ్ చేసింది. కాబట్టి సినిమా కూడా అలాగే ఉంటుంది అంటున్నారు.
Also Read:నల్లజామతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?