Telangana Congress:ఫస్ట్ లిస్ట్ లీక్!

34
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో హడావిడి నెలకొంది. టికెట్లు ఆశిస్తున్న నేతలంతా గాంధీ భవన్‌కు క్యూ కడుతున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు 700 మంది ఆశావాహులు ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. దీంతో దశల వారీగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. తొలుత క్లీయర్‌గా ఉన్న నియోజకవర్గాలను ప్రకటించి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పదికన్నా ఎక్కువమంది అప్లై చేసుకున్నారు. ఇక్కడ అభ్యర్థులను లాస్ట్‌ మినిట్‌లో ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే తాజాగా పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తొలిజాబితాలో 30 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోదాడ – ఉత్తమ్‌ పద్మావతి, మధిర – భట్టి విక్రమార్క, మంథని – శ్రీధర్ బాబు, జగిత్యాల – జీవన్ రెడ్డి, ములుగు – సీతక్క, భద్రాచలం – పొదెం వీరయ్య , సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.

Also Read:నల్లజామతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?

అలాగే అలంపూర్ – సంపత్ కుమార్, నాగార్జునసాగర్ లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి,కామారెడ్డి – షబ్బీర్ అలీ, మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు, ఆందోల్ – దామోదర రాజనర్సింహ, పరిగి – రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి, ఆలేరు – బీర్ల ఐలయ్య, బాల్కొండ – సునీల్ రెడ్డి, కొత్తగూడెం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి, పెద్దపల్లి- విజయ రమణరావు, చొప్పదండి- మేడిపల్లి సత్యం, నిర్మల్ – శ్రీహరి రావు, భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రెడ్డి, బెల్లంపల్లి- గడ్డం వినోద్, నాంపల్లి – ఫిరోజ్ ఖాన్, వేములవాడ- అది శ్రీనివాస్ ఉన్నారు.

Also Read:Nagarjuna:మహేష్‌తో పోటీకి నాగ్ సై?

- Advertisement -