నాగ్‌ నిజంగానే రిస్క్‌ చేస్తున్నాడా..?

118

అక్కినేని అఖిల్ ఫస్ట్‌  సినిమా ‘అఖిల్’.  ఈ సినిమాని బడ్జెట్‌ విషయంలో  ఏ మాత్రం ఆలోచించకుండా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఎలాంటి కిక్ ఇవ్వకపోగా..డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.  అఖిల్ అరంగేట్రంపై వచ్చిన హైప్ చూసుకుని నితిన్ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోలేదు. తర్వాత నితిన్‌ ఎలాంటి తిప్పలుపడ్డాడో అది వేరే విషయం.
Huge Budget for fights in Akhil's next movie
అయితే ఇప్పుడు నితిన్‌ చేసిన  తప్పే మళ్ళీ నాగ్‌ చేయబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నారు సినీ జనం. ఎందుకంటే ‘అఖిల్‌’ డిజాస్టర్‌ వల్ల  ఇప్పుడు అతడి మీద మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. కానీ  అక్కినేని నాగార్జున మాత్రం కొడుకు విషయంలో వెనక్కి తగ్గట్లేదు.  అఖిల్‌ కోసం ఇప్పుడు రిస్క్‌ రెడీ అంటున్నాడు నాగ్‌.

ఇటీవలే అఖిల్‌ రెండొవ సినిమాకి నాగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే రెండో సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం.  ఎందుకంటే ఇది హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్టయిల్లో సాగుతుందట. విక్రమ్‌కు ఈ తరహా సినిమా కొత్త.

ఐతే ఏం చేసినా హై స్టాండర్డ్‌లో ఉండేలా చూసుకునే విక్రమ్.. అఖిల్‌తో చేయబోయే యాక్షన్ ఎంటర్టైనర్‌ను కూడా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. తన ఫ్యామిలీకి ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ మీద నమ్మకంతో నాగ్.. అఖిల్ సినిమా కోసం ఏమడిగితే అది సమకూరుస్తున్నట్లు సమాచారం.
 Huge Budget for fights in Akhil's next movie
అయితే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్‌కే సగం బడ్జెట్ అయిపోతుందట. అందుకోసం హాలీవుడ్ నిపుణుల్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ‘అఖిల్’ అనుభవం నేపథ్యంలో బయ్యర్లు ఈ సినిమాను బడ్జెట్‌కు తగ్గట్లుగా కొనడానికి ముందుకొస్తారా అన్నది సందేహం.  ఇక ఏప్రిల్ 1న పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం  నాగ్ చేస్తున్న రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.