నకిలీ బాస్మతి రకాలను గుర్తించడం ఎలా…

467
- Advertisement -

మీలో ఎంతమందికి బిర్యాన్ని అంటే ఇష్టము. బిర్యాన్ని తినాలంటే ఎక్కడికి వెళ్లాలి? బిర్యాన్ని ఎలా వండాలి? బిర్యాన్ని ఎందుకు వండాలి? బిర్యాన్ని ఎవరి కోసం వండాలి? బిర్యాన్ని ఎప్పుడు వండాలి? అనే సందేహలు ఉంటాయో… కానీ బిర్యాన్ని వండాలంటే ఏ ఏ రకం మసాలా వాడాలి? ఏ చికెన్‌ వాడాలి? చెట్టినాడ్‌, సుగుణ, వెన్‌కాబ్‌ చికెన్‌ ఇందులో ఏది మంచిదో దాన్ని సెలక్ట్‌ చేసుకుంటాము.

బిర్యాన్నికి అసలైన రంగు, వాసన, రుచి రావాలంటే బాస్మతి బియ్యం కావాలి. అందరూ అనేది బాస్మతీ బియ్యం కొంటాం…. వండుకుంటాం. కానీ అసలు మీకు తెలియదు? బాస్మతి ఏ లాంటి రంగును కలిగి ఉంటుందో? ఏ విధమైన వాసన వస్తుందో? కానీ ది బెస్ట్‌ బాస్మతీ బియ్యం కావాలంటే ఉత్తర భారతంకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే భారతదేశంలోనే కాదు…కాదు… ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌సైన హైదరాబాది ధమ్‌ బిర్యాన్ని ఉత్తర భారతదేశంలో పండించిన బియ్యంతో చేస్తారు. బాస్మతి పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్న వివిధ రకాలపై సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌పీడీ) చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటంటే…

ఎలా అధ్యయనం చేశారు…
దేశంలో ఒరిజినల్‌ బాస్మతి పండించే రైతులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన శాంపిళ్లలో మొదటగా 100 గ్రాముల విత్తనాలను సీడీఎఫ్‌పీడీ పరిశోధకులు వేరు చేసి… వాటిని ఆ తర్వాత పిండి చేసి.. అందులో నుంచి 100 మిల్లీగ్రాముల డీఎన్‌ఏను వేరు చేస్తారు. మల్టీప్లెక్స్‌ పీసీఆర్‌, జీనోటైపింగ్‌ పద్ధతి ద్వారా మార్కెట్‌లో లభిస్తున్న అన్ని రకాల బాస్మతి బియ్యం జన్యు పరిణామ క్రమంతో పోల్చిచూశారు. ఇందులో సంప్రదాయరకంగా పరిగణించే డెహ్రాడూన్‌, తరోరాయి, బాస్మతి-386, రణబీర్‌ బాస్మతి, బాస్మతి-217ని పోలినట్టుగా ఉండే నాన్‌ బాస్మతి బియ్యం మార్కెట్లోకి వచ్చినట్టు గుర్తించారు.

గుర్తించడమేలా…
నిజానికి ఒరిజినల్‌ బాస్మతి రకాన్ని గుర్తించడానికి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. కానీ సామాన్య మానవులు కూడా గుర్తిస్తారు. ఎలా అంటే.. సువాసన లేకపోవడం, గంజి ఎక్కువగా రావడం, వండేటప్పుడు సగం ఉడకగానే మెతుకు విరిగిపోవడం వంటి లక్షణాలతో నాన్‌ బాస్మతి బియ్యాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ లక్షణాలు చూసి బియ్యంను ఎంపిక చేసుకుంటారు కొంతమంది కల్నరీలు.

నాణ్యత లేకపోతే రుచి…
మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలైన రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో బాస్మతి రకం పండిస్తున్నారు. మన బాస్మతి బియ్యానికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉన్నది. దానికి కారణం గంగా బ్రహ్మపుత్ర సింధు నదుల ద్వారా తెచ్చిన చిక్కటి ఒండ్రు మట్టి కలగి ఉండటం వల్ల బాస్మతి బియ్యాన్నికి మంచి సువాసన వస్తోందని అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే భారత్‌ ఏటా 39 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది.

దేశీయ బాస్మతిలో ఉండే మినరల్స్‌, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో బాస్మతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారత్‌ వెలుగొందుతున్నది. నాన్‌ బాస్మతి రకం మార్కెట్లోకి రావడంతో ఒరిజినల్‌ రకం ట్రేడ్‌ బిజినెస్‌పై ప్రభావం చూపుతున్నదని, జన్యుమార్పిడి చేసిన బియ్యంతో పోషకాలు తగ్గి అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి..

టీటీడీ ఆస్తుల వివరాలివే..

భారతీయులు గొప్పోళ్లు..పుతిన్ ప్రశంస

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

 

- Advertisement -