ఉత్కంఠకు తెర

221
- Advertisement -
  • మునుగోడు ఓట్ల లెక్కింపు నేడు
  • ఆదివారం 1గంటలకు తేలనున్న భవితవ్యం
  • 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి
  • అభ్యర్ధుల సమక్షంలో ఈవిఎంలు తెరుస్తారు
  • ముందుగా 680 బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  • మధ్యాహ్నం ఒంటిగంటలకు తుది ఫలితం
  • 300 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
  • కౌంటింగ్ కేంద్రం చుట్టూ సిసిటివీ కెమెరాలు
  • 800 మంది పోలీసులతో భారీ భద్రత
  • కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్

దేశం యావత్తూ ఎదురు చూస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం ఎవ్వరిని వరిస్తుందోననే ఉత్కంఠకకు ఆదివారం తెరపడనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తులి ఫలితం రాబోతోంది. కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్తును తేల్చే ఎన్నికగా నిలిచిన మునుగోడులో గెలుస్తారా? ఓడిపోతారో? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ వంటి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు అహోరాత్రులు కష్టపడి పనిచేశారు. ఓట్ల లెక్కింపు సమయం కోసం ఎంతో టెన్షన్, ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం మధ్యాహ్నం ఒంటికల్లా తేలిపోనుంది. అందుకు తగినట్లుగా అధికారులు ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు.

నల్లగొండ శివారులోని ఆర్టాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థకుచెందిన గోడౌన్లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 15 రౌండ్లలో ఓట్లను లెక్కించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆదివారం దయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు, వారి కౌంటింగ్ ఏజెంట్లను ఎన్నికల అధికారులు ఆదివారం ఉదయం ఏడు గంటలకే ఓట్ల లెక్కింపు కేంద్రానికి రావాలని కోరారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు లెక్కింపు ప్రక్రియను అధికారులు కూలంకషంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లకు వివరిస్తారు.

ఉదయం ఎనిమిది గంటలకు 680 బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే 80 ఏళ్ళ వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, అంగవైకల్యం చెందిన వారివేనని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈ.వి.ఎం)లను అభ్యర్ధులు, ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తారు. ఒకే హాలులో 21 టేబుళ్ళను ఏర్పాటు చేశారు.

ఈ ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా అందులో 2,25,192 ఓట్లు (93.13 శాతం) ఓట్లు పోలయ్యాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో 298 ఈ.వి.ఎం.లను ఏర్పాటు చేశారు.

గంటకు మూడు నుంచి నాలుగు రౌండ్ల ఫలితాలను వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర సీ.ఈ.ఓ. వికారాజ్ మీడియాకు వివరించారు. ఈ లెక్కన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేసినట్లుగా తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి-కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో పాటుగా రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తో పాటుగా కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనగుతుందని వివరించారు. లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతలను ఏర్పాటు చేశారు.

జిల్లా పోలీసులతో పాటుగా సి.ఆర్.పి.ఎఫ్.బలగాలతో కూడా కౌంటింగ్ కేంద్రం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. ఏకంగా 800 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని, సి.సి.టి.వి కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను ముందుగా చౌటుప్పల్ మండలం నుంచే ప్రారంభిస్తామని, ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఒక్కొక్క రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల్లో ఈ.వి.ఎం.లలోని ఓట్లను లెక్కిస్తారు.

ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు 150 మంది వరకూ కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు, రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించేందుకు భారీ స్కీన్, మైక్ సెట్లను ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సి.ఈ.ఓ) వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఇవి కూడా చదవండి..

కమల్‌కే ఈర్ష్య పుడుతది..కేటీఆర్‌ ట్వీట్

ఏపీలో కేసీఆర్ వ్యాఖ్యల కలకలం

కమలంలో కల్లోలం

- Advertisement -