ఫోన్ పోయిందా..పేమెంట్ యాప్స్ ఇలా బ్లాక్ చేయండి!

40
- Advertisement -

అరచేతిలో ప్రపంచం..ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకే అన్ని. ఎలాంటి సమాచారం అయినా, పేమెంట్స్ అయినా, టికెట్స్ బక్సింగ్స్ అయినా అండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లోనే కూర్చొని అన్ని చేయోచ్చు. అందుకే స్మార్ట్ ఫోన్ మన ఇంట్లో ఒక భాగమై పోయింది.

డబ్బులు డ్రా చేసే పనిలేకుండా మినీ ఏటీఏంలా పనిచేస్తోంది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌ క్షణాల్లో జరిగిపోతోంది. అయితే ఒకవేళ ఈ యాప్స్ యాక్టివ్‌లో ఉండి మీ ఫోన్‌ పోతే పరిస్థితి ఏంటీ. అందుకే ఒకవేళ మీ ఫోన్ పోయినట్లైతే ఇలా చేయండి.

పేటీఎం యాప్ ఉంటే 01204456456 నంబర్ కు కాల్ చేయాలి. ముందుగా కావాల్సిన భాషను ఎంపిక చేసుకున్న తర్వాత, లాస్ట్ ఫోన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. లేదా అన్ ఆథరైజ్డ్ యూసేజ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అది కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కు కనెక్ట్ అవుతుంది. రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత అకౌంట్ బ్లాక్ అవుతుంది.

ఒకవేళ ఫోన్ పే అయితే 080 68727374 ,గూగుల్ పే యూజర్లు 1800 419 0157 ఈ నంబర్ కు కాల్ చేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీ అకౌంట్ బ్లాక్ అయి డబ్బులు చోరికి గురికావు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -