గంజి గురించి మనందరికి తెలిసే ఉంటుంది. అన్నం వండిన తరువాత అందులోని నీటినే గంజి అంటారు. ఒకప్పుడు గంజిని ప్రతిరోజూ ఉదయం శక్తి కోసం బలం కోసం మన పూర్వీకులు తాగే వారు. గంజిలో ఎన్నో పోషకాలు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ గంజి తాగే వారు ఎంతో బలంగాను దృఢంగాను ఉంటారు. కానీ నేటి రోజుల్లో గంజిని వ్యర్థంగా బయట పారబోస్తున్నారు. దీంతో మన శరీరానికి సహజ సిద్దంగా లభించి ఎన్నో పోషకాలను మనం దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజూ గంజి తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి ? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి అనేవి తెలుసుకుందాం !
గంజిలో విటమిన్ ఏ, మరియు విటమిన్ బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరీరానికి కావలసిన శక్తిని అంధించి కండరాలను పుష్ఠిగా తయారు చేస్తాయి. గంజిలో ఉండే అమినో యాసిడ్స్ రోగ నిరోదక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గంజిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థలోని చాలా సమస్యలు దురమౌతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పడుతుందట.
గంజిలో ఉండే ఫ్లెవనాయిడ్లు శరీర కాంతిని పెంచడంతో పాటు ముడతలను కూడా దూరం చేస్తుంది. ఇక అలాగే జుట్టు బలానికి కూడా గంజి ఎంతో ఉపయోగ పడుతుందని పలు అధ్యయనలు చెబుతున్నాయి. ఇక ప్రతిరోజూ గంజి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వాంతులు, విరోచనలు వంటి సమస్యలతో బాధ పడే వారు గంజిని ఆహారంగా తీసుకుంటే ఆ సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయి. ఇక గంజిని మొఖంపై రాసుకుంటే వృద్దప్య ఛాయలు రాకుండా ఉంటాయట. కాబట్టి ప్రతిరోజూ గంజి తాగడం అలవాటు చేసుకుంటే శరీరానికి అవసరమయ్యే అన్నీ రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Harish: ఉద్యోగుల కష్టాలు కనిపించడం లేదా