బచ్చలి జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

31
- Advertisement -

మార్కెట్లో విరివిగా దొరికే ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. దీనిని పప్పుగా లేదా కర్రిగా చేసుకొని తింటూ ఉంటారు. అయితే బచ్చలి కూరను కొందరు ఎంతో ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపరు. నిజంగా బచ్చలి కూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల గనిగా పరిగణిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే బచ్చలి కూర తినడానికి ఇష్టపడని వారు దానిని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎంతో మేలట. బచ్చలి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు నేరుగా అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బచ్చలి జ్యూస్ ప్రతిరోజూ తాగడం వల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఇంకా మూత్ర సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుందట.

చాలమందికి మూత్ర విసర్జన చేసే టైమ్ లో మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు ప్రతిరోజూ బచ్చలి జ్యూస్ తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకా పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు.. వంటి సమస్యలకు బచ్చలి దివ్య ఔషధంలా పని చేస్తుందట. బచ్చలి లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను, వ్యర్థాలను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పని చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవికాలంలో శరీర వేడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. బచ్చలిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ శరీర వేడిని తగ్గించి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయట. అయితే బచ్చలి జ్యూస్ ను నేరుగా సేవించలేని వారు. అందులో తేనె లేదా పటికబెల్లం వేసుకొని సేవించడం మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

గమనిక ; ఈ సమాచారం మీ అవగాహన నిమిత్తం అందించబడినది. కాబట్టి ఇందులో ఉన్న విషయాలను పాటించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Also  Read:Trivkram:త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే?

- Advertisement -