హరికృష్ణ కొన ఊపిరితో ఉంటే.. వాళ్ళేం చేశారో చూడండి..!

258
Hospital Staff Selfie With Nandamuri Hari Krishna Dead Body
- Advertisement -

ఏదైనా అంబులెన్సు కనిపిస్తే మనం వెంటనే దారిచ్చి ముందుకు వెళ్లేందుకు సహాయపడతాం. అది వైద్యానికి మనమిచ్చే గౌరవం. ప్రాణాన్ని కాపాడే వైద్యులకు, నర్సులకు మనమిచ్చే మర్యాద. కానీ కొందరు నర్స్ లు ప్రాణాల విలువతెలియకుండా తుది శ్వాసలో ఉన్న వాళ్ళని కాపాడకుండా , కబుర్లు చెప్పుకుంటూ, సెల్ఫీ లు దిగుతూ కాలయాపన చేస్తున్నారు. ఇదే పరిస్థితి నందమూరి హరికృష్ణ కి కూడా వచ్చిందని సోషల్ మీడియాలో బయటపడ్డ ఫోటోలు చెబుతున్నాయ్.

Hospital Staff Selfie With Nandamuri Hari Krishna Dead Body

నందమూరి హరికృష్ణ కారు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన సమయంలో ఆయన్ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కానీ వెంటనే చికిత్స చేయాల్సిన వైద్య సిబ్బంది సెల్ఫీలు తీసుకున్నారు. వారు దిగిన సెల్ఫీలే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలకు దారితీసాయి. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వీళ్లకి కాలయాపన చేయడానికి మనసెలా వచ్చింది అంటూ నందమూరి అభిమానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృత్యువ్యూహం లో ఓ మనిషి చిక్కుకుపోయి ఉంటే ఆయన విఐపి అని సెల్ఫీ లు దిగేంత కర్కశత్వం ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కోపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -