బన్నీ, నాని ఆర్కెస్ట్రా అదిరిపోయింది..!

224

స్నేహాన్ని విలువనివ్వడం లో బన్నీ ఎప్పుడూ ముందుంటాడు. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన జాకెట్ వేసుకుని తన ఫంక్షన్ కి వచ్చి తన స్నేహాన్ని నిరూపించుకున్నాడు బన్నీ. ఇప్పుడు నానితో కలిసి ఆడుతూ పడుతూ తనలో ఉన్న స్నేహితుడిని మళ్ళీ బయటపెట్టాడు.

Nani and Allu Arjun Bonding over Singing and Dancing

తమ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన బన్నీ,నాని లు తమ సతీసమేతంగా విచ్చేసి ఒకరితర్వాత ఒకరు, తర్వాత ఇద్దరు కలిసి ఆడి , పాడి పెళ్ళికి వచ్చిన వాళ్లలో ఫుల్ జోష్ ని నింపేశారు. అల్లు అర్జున్ తన ఆర్య 2 సినిమాలో “ఉప్పెనంత ఈ ప్రేమకి ” పాట పాడుతూ తన భార్య స్నేహ రెడ్డితో చిన్న చిన్న స్టెప్పులేయగా , నాని నిన్నుకోరిలో ” అడిగా అడిగా ” సాంగ్ తన భార్య అంజనా తో కలిసి పాడారు. ఇక బన్నీ నాని ఇద్దరూ కలిసి ఎటువెళ్లిపోయింది సినిమా లోంచి “ప్రియతమా నీవచట కుశలమా ” పాట పాడి అక్కడి వారందరి హృదయాలను మైమరచిపోయేలా చేసారు.

Nani and Allu Arjun Bonding over Singing and Dancing

అస్సలు ఇద్దరూ స్టార్ హీరోలు ఒక చోట కలిసి ఓ ఫోటోకి ఫోజ్ ఇస్తేనే ఆ ఫోటో వైరల్ అయిపోతుంది. అలాంటిది ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి అది తమ సతీమణులతో చిందులేస్తూ, పాటలు పాడుతూ ఓ ఆర్కెస్ట్రానే పెట్టేశారంటే. ఇక వాళ్ళ అభిమానులు ఆగుతారా.. వైరల్ చేసి పారేయరూ. అదే ఇప్పుడు జరుగుతుంది. బన్నీ, నాని ఆర్కెస్ట్రా అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్లు పెట్టేస్తున్నారు.