- Advertisement -
నిత్యావసర సరుకులు కొరత లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శకులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. నిత్యావసర ఉత్పత్తి సంస్థల్లో కార్మికుల కొరతపై దృష్టి సారించాలని సూచించారు.
నిత్యావసరాల అక్రమ నిల్వలు, అధిక ధరలు లేకుండా చూడాలని…నిత్యావసరాలకు ముడి సరకు కొరత లేకుండా చూడాలని సూచించారు. సరఫరాలో ఇబ్బంది లేకుండా అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీలర్లపై నిఘా పెంచి వారి ఖాతాలను నిత్యం పరిశీలించాలని స్పష్టం చేశారు అజయ్ భల్లా.
- Advertisement -