వ్యక్తిగత సిబ్బందిని అభినందించిన ఎంపీ సంతోష్..

133
mp santhosh

కరోనాపై పోరులో భాగంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు,సినీ నటులు,ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యక్తిగత సిబ్బంది సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. ఎంపీ పీఏ శ్రీకాంత్‌,సెక్యూరిటీ సిబ్బంది రూ. 50 వేల రూపాయలను అందించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించిన సంతోష్..మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందన్నారు.