Teeth Pain:పంటి నొప్పికి ఇంటి వైద్యం

579
- Advertisement -

మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైనవి పళ్లు. మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల  దీర్ఘకాలంలో సరిదిద్దలేని నష్టాన్ని  కలిగించే బాధను మిగులుస్తాయి.  అయితే రకరకాల కారణాలతో పంటి నొప్పి రావచ్చు. పిప్పిపళ్లు ఏర్పడడం, ఇన్‌ఫెక్షన్ రావడం, పన్నులో పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. పంటి నొప్పి ఎందుకు కలిగినా వెంటనే ఉపశమనం పొంది తీరాలి. లేదంటే ఏ పనిసాగదు. అలాంటి పంటి నొప్పిని తగ్గించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు….

-దంతాలు చాలా సెన్సిటివ్‌గా మారి ఏం తిన్నా జువ్వుమన్న భావన కలుగుతున్నపుడు మిరియాలు, ఉప్పుతో చేసిన మిశ్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు, మిరియాలలో యాంటి బ్యాక్టిరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పి తగ్గించే అనాల్జిసిక్ గుణాలు ఉంటాయి.

-మిరియాల పొడిని ఉప్పును సమపాళ్లలో తీసుకొని కొద్దిగా నీళ్లు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా దంతాలు, చిగుళ్లకు మసాజ్ చేసి కొద్ది నిమిషాలపాటు ఆగాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే కొద్ది రోజుల్లో దంతాల సెన్సిటివిటి తప్పకుండా తగ్గుతుంది.

-లవంగాలకు యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేస్థెటిక్ అంటే నొప్పి తెలియకండా చేసే లక్షణాన్ని కూడా ఉంటాయి. ఇది పంటి నొప్పి, దంతాల్లో ఇన్‌ఫెక్షన్‌తో సమర్థవంతంగా పోరాడుతుంది.

-రెండు లవంగాలను మెత్తగా పొడి చేసి దాన్ని ఆలీవ్ ఆయిల్ లేదా మరేదైనా వంటనూనెతో కలిపి మిశ్రమంగా తయారు చేసి నొప్పిగా ఉన్న పన్ను మీద రాయాలి. లేదా కొద్దిగా లవంగ నూనెను సగం గ్లాసు నీళ్లలో కలిపి దాన్ని మౌత్ వాష్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

-అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు, చల్లటి, వేడి మరియు తీపి పదార్ధాలు నొప్పిని అధికం చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

-ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చిరుతిళ్ళు తినరాదు.

-మీ చిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

-లవంగాలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.

Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!

- Advertisement -