రాష్ట్రంలో ని అన్ని కుటుంబాలలో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్ దేవుడు అందించిన బహుమతి అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా, ప్రతి పేదవానికి పథకాలు రూపొందించి అమలు పరుస్తున్నారు హోంమంత్రి కితాబిచ్చారు. ఇక్కడి పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుండటం గమనించ దగింది అన్నారు.
సాగు నీరు, తాగు నీరు ప్రాజెక్టు లు, పింఛన్ లు, గురుకుల పాఠశాలలు , నాణ్యమైన వైద్య సదుపాయాలు బోధనా రుసుము చెల్లింపు. వీదేశి విద్యకు 20 లక్షల గ్రాంటు, రైతు బంధు , భీమా గొప్ప పథకాలు దేశంలో ఎక్కడలేవన్నారు. శాంతి భద్రత లో రక్షణ లో కూడా తెలంగాణ no.1 అని చెపుతూ, సీసీ కెమెరా నిఘా నేత్రంలో భారీ స్థాయిలో క్రైమ్ రేట్ ని తగ్గించ గళిగమన్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ ఆధునిక పరిజ్ఞానం తో ఆసియా లోనే ఎక్కడ లేని విధంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ మానస పుత్రికలే అని తెలిపారు. సీఎం కేసీఆర్ 67 జన్మదిన సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సేవా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు, దివ్యంగులకు ఉచితంగా వీల్ ఛైర్స్, చేతి కర్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హోంమంత్రి మహమ్మద్ అలీ విశిష్ట అతిథులుగా mlc మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీసీ కమిషన్ పూర్వ సభ్యులు డా. వకులబరణం కృష్ణమోహన్ రావు, ఆత్మీయ అతిథులుగా డా ఆశిష్ చౌహన్, డా. హరి చరణ్ లు పాల్గొన్నారు.
Trs సీనియర్ నాయకులు జంజీరాల రాజేష్ నేత సభ అధ్యక్షత న ఈ కార్యక్రమం జరిగింది.సభలో రాజేష్ నేత వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.mlc శ్రీనివాస్ రెడ్డి: సీఎం కేసీఆర్ నాయకత్వం లో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమం లో పాల్గొనడం, తెలంగాణ భవన్ ఇంచార్జి గా 2 దశాబ్దాలుగా పని చేసే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
బీసీ కమిషన్ పూర్వ సభ్యులు డా. వకులబరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ: సీఎం కేసీఆర్ కరణజన్ముడు అని కొనియాడారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ని సాధించడం సీఎం కేసీఆర్ దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పథకాలను రూపొందించి అమలు చేయడం సాధ్యమైందని అన్నారు. మానవీయ కోణంలో పథక రచన చేసి అమల్లోకి తేవడం ద్వారా ప్రజలు ఆత్మబందువుగా సీఎం కేసీఆర్ ని భావిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ సేవ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు అంకెనపల్లి మల్లికార్జున్ రావు ప్రసంగిస్తూ… గడిచిన 7 ఏళ్లుగా ప్రతి ఫిబ్రవరి 17 న తెలంగాణ భవన్ లో దివ్యంగులకు ఉచితంగా వస్తువుల పంపిణీ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పేరిట ఖర్మన్గాఘట్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు జరిపి తెచ్చిన లడ్డు ప్రసాదం ప్పంపిణీ చేసారు. వేడుకలు జరుగున్నంత సేపు భవన్ లో పండుగ వాతావరణం కనిపించింది.సమన్వయ కర్తలుగా : R సాయినాథ్, A రాఘవేంద్ర వ్యవహరించారు.