టీఆర్ఎస్ మెంబర్‌షిప్‌ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి…

121
dayakar rao
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్‌లో భాగంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తన స్వగ్రామం పర్వతగిరిలో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకున్న అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…ఉద్యమంతో తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణ చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని మంత్రి తెలిపారు.

ఈసారి 80 లక్షల సభ్యత్వం జరిగే విధంగా పార్టీ శ్రేణులు చూసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వాన్ని బలపరిచే విధంగా పార్టీ శ్రేణులు నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లికి పర్వతగిరి గ్రామ సర్పంచ్ సోమేశ్వర రావు, పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు పార్టీ సభ్యత్వం అందజేశారు.

- Advertisement -