నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం..

871
Ramzan
- Advertisement -

ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ప్రకటించారు రుహియతే హిలాల్ కమిటీ. అయితే ప్రతిసారి ఆకాశంలో నెలవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి రంజాన్ మాసాన్ని ప్రారంభిస్తారు. ఈసారి రంజాన్ మాసం మంగళవారం ప్రారంభమవుతుందని హైదరాబాద్ లోని రుహియతే హిలాల్ కమిటీ పేర్కొంది.

ఆదివారం నాడు నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖత్తారీ తెలిపారు. ఆదివారం నెలవంక కనిపించకపోవడంతో సోమవారం రాత్రి దర్వనమిచ్చింది. ఈసందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇవాల్టీ నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు.

వేకువ జామున 4 గంటలకు అల్పాహారాన్ని తీసుకుంటారు. తెల్లవారిన దగ్గర్నుంచి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా దీక్షను పాటించి తరువాత దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. రంజాన్న మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులకు ప్రధాని మెదీ, సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ కవిత, వైఎస్ జగన్ పలువురు రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు

- Advertisement -