తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఉప ఎన్నికలు..

130
Telanagan Council

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇటివలే ఖాళి అయిన మరో మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నుంచి మండలికి ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.

దీంతో ఈనెల 31న ఈ మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మే14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మే 15 నామినేషన్ల పరిశీలన ఉండగా… 17వ తేదిన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ప్రకటించారు.

మే 31న పోలింగ్ జరుగగా..జూన్ 3 న ఫలితాలు వెలువడనున్నాయి. రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవగా , నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక కొండా మురళి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు.