హైదరాబాద్‌లో కర్ఫ్యూపై హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..!

194
ali
- Advertisement -

తెలంగాణలో మళ్లీ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించారు హోం మంత్రి మహమూద్ అలీ. రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అలీ స్పష్టం చేశారు.

ఓల్డ్ సిటీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ…. భారతదేశం అంతటా అలానే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ లేవని అన్నారు.

ఈ లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేస్తూ, మహమూద్ అలీ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను నివారించాలని మరియు ఫేస్ మాస్క్‌లను వెంటనే ఉపయోగించాలని అభ్యర్థించారు.

- Advertisement -