సచివాలయంలో మసీదు నిర్మాణం..శంఖుస్ధాపన

18
masjid

సమీకృత కొత్త సచివాలయంలో మసీదు నిర్మాణానికి ఇవాళ శంఖుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా నిర్మాణ ప్రాంగణంలో పునాదిరాయి పడనుంది. ఈ కార్యక్రమంలో జామియా నిజామియా యూనివర్సిటీ ఛాన్స్ లర్, ఇస్లామిక్ స్కాలర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ పాల్గొంటారు.

ఎంఐఎం పార్టీ నుంచి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాల, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి దిశా నిర్దేశంలో మస్జీద్ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.