‘హిట్ 2’ హిట్టే.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

225
- Advertisement -

అడవి శేష్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2 ఫస్ట్ డే మంచి నెంబర్లు నమోదు చేసే దిశగా సాగిపోతోంది. తొలి రోజు మార్నింగ్ షోకి నైజాంలో నమోదు చేసిన ఫలితాలకు మించి మ్యాట్నీ షోకి నమోదు చేసింది. మొదటి రోజుకు నైజాంలో హిట్ 2 కి 2.50 కోట్లు గ్రాస్ రావడం విశేషం. ఆంధ్ర కాస్త స్లోగా స్టార్ట్ అయినా, మ్యాట్నీ షో టికెట్లు ఆల్ రెడీ హౌస్ ఫుల్ అయిపోయాయి. పెద్ద సెంటర్లు తక్కువగా వున్న చోట్ల ఫిగర్లు తక్కువగా వున్నా, ఓవరాల్ గా చాలా చోట్ల హిట్ 2 కలెక్షన్స్ బాగున్నాయి.

విశాఖలో మొదటి రోజుకు గానూ అంచనాల ప్రకారం హిట్ 2 చిత్రం 95 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. కృష్ణా మొదటి రోజుకు గానూ 60 లక్షలు, గుంటూరు 62 లక్షలు, సీడెడ్ 80 లక్షలు, ఈస్ట్ 34 లక్షలు వసూలు చేసేలా బుకింగ్స్ ఉన్నాయి. ఎలాగూ రేపు శనివారం. కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే సండే కూడా అంతకు మించి ఫిగర్లు నమోదు చేస్తుందనే ఇండికేషన్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరి మండే కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ 2 కలెక్షన్స్ స్టడీగా ఉంటే.. సినిమా పూర్తి విజ‌యం సాధించినట్లే. ఫస్ట్ వీకెండ్ లో హ్యాపీగా బయ్యర్లు అందరూ సేఫ్ అవుతారని డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి సమాచారాం అందుతుంది. పైగా హిట్ 2 కి యుఎస్ లో.. ఆస్ట్రేలియా లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి…

రష్యన్లు ఫిదా అయిన సామి పాట…

విజయ్ దేవరకొండ కి అది చాలా అవసరం

తండ్రైన సింగర్ రేవంత్..

- Advertisement -