సింగం ఇజ్‌ బ్యాక్‌…

146
- Advertisement -

బాజీరావ్‌ సింగం మళ్లీ వస్తున్నాడు. అవును బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన సింగం సిరీస్‌లో భాగంగా మూడవ సింగం వస్తున్నట్టు బాలీవుడ్‌లో సమాచారం. సింగం, సింగం రిటర్స్న్‌, సింగం ఆగైన్‌ అంటూ ఒక ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తమిళ చిత్రానికి రీమేక్‌గా చేసిన సింగం సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం అజయ్‌దేవ్‌గన్‌ భోళా సినిమా తర్వాత సింగం సెట్‌లోకి వస్తుందని బాలీవుడ్‌ టాక్. భోళా సినిమాను స్వయంగా అజయ్‌ దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా….ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. అజయ్ దృశ్యం-2 విజయ పరంపర కొనసాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల కనకవర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.200కోట్ల క్లబ్‌లో చేరింది.

ఇవి కూడా చదవండి…

రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!

విక్కీ కౌశల్‌ హీరోగా సామ్‌ బహుదూర్‌

వయసైపోతున్నా అందం తగ్గట్లేదు.. కారణమదే

- Advertisement -