మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

2
- Advertisement -

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇచ్చింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు ఇచ్చింది.

ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 చెల్లించనుంది ఆర్టీసీ. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం .దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.

పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్.

Also Read:ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా

- Advertisement -