ఏపీలో పట్టాలు తప్పిన రైలు..35 మృతి

184
Express
- Advertisement -

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద ఘెర ప్రమాదం జరిగింది. జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం రాత్రి 11.30 సమయంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 35 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయలైయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పార్వతీపురం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందజేస్తున్నారు. కొంతమందికి తీవ్రగాయలైన దృష్ట్య మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న రైలు కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలు తప్పడంతో..ఇంజన్‌ సహా ఇంజన్‌ సహా 9 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టాయి.

Express

బోగీలు నుజ్జునుజ్జ కావడంతో మృతులు సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాలు వాటిలో ఇరుక్కు పోయాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి వాల్తేరు డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ రిలీఫ్‌ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకార్యక్రమాలు ముమ్మరం చేశారు. విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణీకులను విశాఖ, విజయనగరం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వారి..వారి ప్రాంతాలకు తరిలించారు. మృతి చెందినవారిలో ఎక్కువమంది ఒడిశా వాళ్లు ఉన్నట్లు సమాచారం. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న ఒడిశా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.

Express

హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకటించిన రైల్వేశాఖ
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకటించింది. బంధువుల సమాచారం కోసం 06856-223400, 06856-223500, 09439741181, 09439741071, 07681878777, విజయనగరం రైల్వే స్టేషన్ హెల్ప్‌లైన్ నెంబర్లు 83331, 83332, 83333, 8334, 08922-221202, 08922-221206 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సుచించారు.

ఈ రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి రైల్వేశాఖ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేల నష్టపరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.

మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మోదీ ట్వీట్‌ చేశారు.

రైల్వే శాఖ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, క్షతగాత్రులను ఆదుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

- Advertisement -