బండారు దత్తాత్రేయకు గుండెపోటు..అపోలో ఆసుపత్రిలో చికిత్స

427
dattatrya bjp
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అస్వస్ధకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రి వైద్యులు గవర్నర్ దత్తాత్రేయకు చికిత్స అందజేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

- Advertisement -