- Advertisement -
హైదరాబాద్ ఐఐటీ దేశంలోనే అత్యున్నత విద్యాసంస్ధగా ఎదిగిందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. నేడు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ను సందర్శించారు గవర్నర్ దత్తాత్రేయ. అనంతరం ఐఐటీ విద్యార్దులతో మాట్లాడారు.ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ….ఐఐటి హెచ్ పరిశోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజిన్స్ కి ప్రాధాన్యత పెరుగుతున్నందున్న ఐఐటి హైదరబాద్ దాని పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జపాన్ ప్రభుత్వ సంస్థతో కొలబరెషన్ చెసుకోవడం గర్వించ దగ్గ విషయం అన్నారు. ఐఐటియన్ లు కొంతమంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చెసుకోవడం బాద కలిగించినట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం చదవకండి ఉద్యోగాలిచ్చేలా ఐఐటి నుండి బయటకు రావాలని పిలపునిచ్చారు.
- Advertisement -