హిజ్రా మాఫియా…పోలీసులపై దాడి..!

226
Hijras fight with police
- Advertisement -

డబ్బుల కోసం హిజ్రాలు చేసే హంగామా అంతా ఇంతకాదు. రైళ్లలో ప్రయాణీకుల దగ్గరి నుండి ఎక్కడ టెంట్ కనబడినా,ప్రారంభోత్సవం,శుభకార్యం ఏదైనా వాలిపోతారు. అడిగింది ఇవ్వకపోతే అశ్లీల చేష్టలు,నోటికొచ్చిన బుతులతో నానాహంగామా చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీరి దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోవడంతో ఉక్కుపాదం మోపారు పోలీసులు.

కొంతకాలం స్తబ్దుగా ఉన్న హిజ్రాలు మచ్చిరెచ్చిపోయారు. ఉప్పల్‌,కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, మాదాపూర్‌ ఏరియా ఏదైనా ప్రజలను బెదిరించడం,తిట్టడం,డబ్బులు వసూలు చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. ఇవేగాక ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ప్రయాణీకులపై దౌర్జన్యాలు ఓవరాల్ గా  యాచించే స్ధాయి నుండి దందాల స్థాయికి హైదరాబాద్ హిజ్రా మాఫియా ఎదిగింది.

పోలీస్‌స్టేషన్‌కే వచ్చి, సాక్షాత్తూ పోలీసులనే కొట్టగలిగారంటే వారి ధైర్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో దాదాపు 5000 మందికి పైగా హిజ్రాలున్నట్లు అంచనా. వీరిలో చాలామంది మగవారే. ఏ పనికీ ఒళ్లువంగక, సులువుగా డబ్బు సంపాదించేందుకు హిజ్రాలుగా చలమాణీ అవుతున్నారు.

ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా వాలిపోతున్నారు. ఇచ్చినదాంతో సంతృప్తిపడట్లేదు. వాళ్లు డిమాండ్ చేసినంతా ఇవ్వాల్సీ వస్తోంది. నగరంలోని ప్రతీ పౌరుడూ ఏదో ఒక సందర్భంలో వీరి బాధితుడే అనడం అతిశయోక్తేమీ కాదు.

హిజ్రాల పట్ల ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు, పోలీసులు కూడా చూసిచూడనట్లు ఉండటంతో  మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై చర్యలు తీసుకుని సామాన్యలుకు రక్షణ కల్పించాలని ప్రజలు వాపోతున్నారు.

- Advertisement -