3 నెలలు ఇంటి వద్దె వసూలు చేయవద్దు..

188
kcr
- Advertisement -

3 నెలల పాటు ఎలాంటి ఇంటి అద్దె వసూలు చేయవద్దని ఇంటి ఓనర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం…మే 7వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు.

తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రయాణికులు 100% కోలుకున్నారని…ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అన్ని సర్వేల్లో లాక్ డౌన్ పొడగించాలని వచ్చిందని…తెలంగాణ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంటుందన్నారు.

మే ఐదవ తేదీన మరోసారి మంత్రి వర్గ సమావేశం అవుతుందని….వ్యాధిని నివారించడంలో విఫలం కావద్దన్నారు. కంటోన్మెంట్లో ఉన్న ప్రజలు బయటకు రావద్దని…మే 7వ తేదీ వరకు విమాన ప్రయాణికులు తెలంగాణకు రావద్దన్నారు.

దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదని…పిజ్జా, జుమాటో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. బయట నుంచి ఎవరూ కూడా తినుబండారాలను తెప్పించు కోవద్దని…హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ఎవరూ కూడా ప్రార్థనలు పూజలు, చేయడానికి వీలులేదన్నారు.ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలను అనుమతించేది లేదన్నారు.ఔ

లాక్ డౌన్ సమయంలో ప్రజల సహకారం మరువలేనిదని…పారిశుద్ధ్య నిర్వహణ లో మున్సిపల్ గ్రామ పంచాయతీల పనితీరు భేష్ అన్నారు. ఉద్యోగులకు వేతనాల్లో 50%, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత. గత నెల మాదిరి గానే ఏప్రిల్ మాసంలో అందివ్వడం జరుగుతుందన్నారు.

వైద్యులు,పోలీసులకు నెలవారి జీవితంలో 10% గ్రాస్ అదనంగా ఇస్తామని..అన్ని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 100% వేతనాలు ఇస్తామన్నారు.ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు కట్టమని బలవంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన రూ.1500 వెనక్కి పోతాయని ఎవరూ కూడా భయపడవద్దన్నారు. తెలంగాణలో క్రీడా సమగ్ర విధానాన్ని అమలు చేసేందుకు కేబినెట్‌లో చర్చించాం….ఇందుకోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

- Advertisement -