సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ వివాదాల్లో చిక్కుకోవడం ఏంటి..? వర్మానే వివాదాల్లోకి వెళ్తాడుగా అనేగా మీ సందేహం? వివాదాలను వెంటాడటం వర్మ నైజం. అది కరెక్టే. కానీ …విచిత్రంగా వర్మానే ఓ వివాదం వెంటాడుతోంది.
ఇటీవల బాలీవుడ్ వెళ్లి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన రామ్‌గోపాల్ వర్మ ‘సర్కార్-3’ వివాదాల్లోకొచ్చింది. ఈ సినిమాకి కథ రాసింది వర్మ కాదు అంటూ ఓ వ్యక్తి వర్మపై కేసు వేశాడు. అతనే నీలేష్ గిర్కార్.
‘సర్కార్-3’ కథని వర్మ నొక్కేశాడట. అందుకు డబ్బు కూడా చెల్లించలేదట. అంతేకాకుండా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయడం లేదని సదరు రచయిత బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ మొదలైంది. కోర్టు రచయితకే సపోర్టునిస్తోంది.‘సర్కార్-3 ‘స్పెషల్ స్క్రీనింగ్ వేసిన త్వరగా సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వివాదం పరిష్కరించే ముందు కోర్టులో 6.2లక్షలు డిపాజిట్ చేయాలని వర్మకు తాఖీదులు కూడా జారీ చేసింది. మరి ఏప్రిల్ 7న ‘సర్కార్-3’ రిలీజ్ అవబోతోంది. కాబట్టి ఈలోగానే ఈ వివాదాన్ని వర్మ పరిష్కరించుకోగలడా? లేదా? అన్నది చూడాలి.