దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

7
- Advertisement -

స్పీకర్ ట్రిబ్యునల్, దానం నాగేందర్ కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన వ్యవహారం పై స్పీకర్ తీర్పు ను కొట్టివేయాలని కోరారు మహేశ్వర్ రెడ్డి న్యాయవాది . BRS పార్టీ నుండి MLA గా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుండి లోకసభ ఎన్నికల్లో దానం పోటీ చేశారని మహేశ్వర్ రెడ్డి న్యాయవాది తెలిపారు.

ఇతర పార్టీ నుండి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు పిటిషనర్ న్యాయవాది. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పిటిషన్ ల పై సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు న్యాయవాది.

స్పీకర్ తరుపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఏజీ గా ఉండి ఎలా స్పీకర్ తరుపున వాదిస్తారని హై కోర్టు అభిప్రాయపడగా సీనియర్ న్యాయవాదిగా హాజరు అవుతున్నాననని సుదర్శన్ రెడ్డి చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్, స్పీకర్ ట్రిబ్యునల్‌ను కోరిన హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 16 కు వాయిదా వేసింది.

Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

- Advertisement -