రాష్ట్ర ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరిస్తుందని అని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన శంకర్..అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండు ఏళ్ళు గడిచినా అమలు చేయలేదు అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదు..విశ్రాంత ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించడం లేదు అన్నారు. ఇచ్చిన హామీల అమలుకై ఛలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే కార్యకర్తలను అరెస్టు చేశారు.తెరాస పాలన కన్నా నిర్బంధం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుందన్నారు. అరెస్టులను బీజేపీ పార్టీ ఖండిస్తుందని… ఇదే పంథా అవలంభించిన తెరాస పార్టీని ప్రజలు గద్దె దించారు. రాబోయే రోజుల్లో మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అన్నారు.
నిన్న రాత్రి నుండి ఛలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు…ఖర్చుకు, ప్రవేశపెట్టిన బడ్జెట్ కు పొంతన లేదు.విద్యార్ధులకు స్కూటీలు, మహిళలకు నెలకు 2500, తులం బంగారం అన్ని హామీలు విస్మరించారు.బీజేపీ పార్టీ అరెస్టులకు భయపడదు.అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

