రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

9
- Advertisement -

ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే చాలా మంది ముందుగా చక్కెర, కేకులు, సాఫ్ట్ డ్రింక్స్‌లను తప్పుపడతారు. అవి ప్రభావం చూపుతాయనేది నిజమే. కానీ మనం సాధారణంగా పట్టించుకోని ఒక అలవాటు మరింత ప్రమాదకరం—అదే బిస్కెట్లు.

రోజూ టీతో తినే బిస్కెట్లు నిశ్శబ్దంగా మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో గ్లూకోజ్‌ను కణాల్లోకి పంపించే హార్మోన్ ఇన్సులిన్. కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోతే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కాలక్రమేణా:

అలసట
బ్రెయిన్ ఫాగ్
బరువు పెరగడం
పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం
చివరికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది

ఈ సమస్య ఒక్కసారిగా రాదు. చిన్న చిన్న అలవాట్ల వల్ల సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా పెరుగుతుంది.

బిస్కెట్లు ఎందుకు హానికరం?

బిస్కెట్లలో సాధారణంగా ఉండే పదార్థాలు:

మైదా
చక్కెర
వెజిటబుల్ ఆయిల్స్

ఇవి కలిపి మెటబాలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి:

మైదా శరీరంలో వేగంగా గ్లూకోజ్‌గా మారుతుంది
చక్కెర రక్తంలో గ్లూకోజ్‌ను ఒక్కసారిగా పెంచుతుంది
రిఫైన్ ఆయిల్స్ ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తాయి
ఫైబర్ లేకపోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువవుతాయి
ప్రోటీన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ త్వరగా శోషణ అవుతుంది.

Also Read:త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!

టీతో బిస్కెట్లు తినడం వల్ల ఏమవుతుంది?
20–30 నిమిషాల్లో గ్లూకోజ్ స్పైక్
60–90 నిమిషాల్లో గ్లూకోజ్ క్రాష్
వెంటనే మళ్లీ ఆకలి.దీంతో మళ్లీ బిస్కెట్లు తినే అలవాటు ఏర్పడుతుంది. ఇలా ఇది ఒక సైకిల్‌గా మారుతుంది.

అందుకే 4 వారాలు బిస్కెట్లు మానేయండి. బదులుగా ప్రోటీన్ స్నాక్స్ తీసుకోండి.
ఉడికించిన గుడ్లు
పనీర్
గ్రీక్ యోగర్ట్
బాదం

ఫలితాలు:

1 వారం: అలసట తగ్గుతుంది
3–4 వారాలు: ఆకలి తగ్గుతుంది
6–8 వారాలు: ఇన్సులిన్ మెరుగవుతుంది
10–12 వారాలు: స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి

- Advertisement -