బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మేం పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలి అన్నారు.
మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధుల్లో అభ్యర్థులను మేమే బరిలోకి దించుతాం… రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నేను ఇప్పటికే సర్వేలు చేశాం.. మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తాం అన్నారు.
ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో నాకు ఇప్పటికి సమాచారం లేదు… పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదు అన్నారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
సీనియర్ నేతగా నాకు ఒక గుర్తింపు ఉంది.. పార్టీ దాన్ని కాపాడుకోవాలి… సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారు అన్నారు. సొంత పార్టీ నేతలే నాపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదు…మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

