ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా ముసారాంబాగ్ లోని తన నివాసం ప్రాంగణంలో మొక్కలు నాటారు S&H Law Advisors, హైకోర్టు అడ్వొకేట్స్ హరనాథ్ రావు , శ్రీదేవి.
ఈ సందర్భంగా శ్రీదేవి హరినాథ్ రావు మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని ఈ రోజు తమ నివాసంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ సంరక్షణకు సమతుల్యాణికి మొక్కలు ఎంతో అవసరమని,ప్రతి ఒక్కరు మొక్కలు నాటే బాధ్యత చెప్పట్టాలని కోరారు. భావితరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే దేశంలో పచ్చదనం పెరగాలని అన్నారు… ఇంతటి అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం ఎల్.నరసింహరెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్నా హైకోర్టు, జి.ప్రవీణ్ కుమార్ డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హై కోర్టు,వి వి ఎస్ ఎన్ రాజు హైకోర్టు అడ్వకేట్ జురీస్ ప్రైమ్ లా ఫర్మ్ వీరిని మొక్కలు నాటాలని కోరారు.
ఇవి కూడా చదవండి..