- Advertisement -
టీకాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించిన న్యాయస్థానం…సునీల్‌ని అరెస్ట్ చేసే వీల్లేదని సీసీఎస్ పోలీసులకు సూచించింది.
ఇక విచారణపై స్టే ఇవ్వాలనే సునీల్ పిటిషన్‌ని తిరస్కరించింది. పోలీసుల విచారణకు సహకరించాలి సునీల్‌ను ఆదేశించింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో సునీల్ విచారణకు హాజరుకావడం తప్పనిసరైంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న ఫిర్యాదుతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్‌తో పాటు ఆయన టీంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇవి కూడా చదవండి…
- Advertisement -