ఢిల్లీలో హైఅలర్ట్‌.. ఉగ్ర ముప్పు!

4
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర ముప్పు నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ మరియు చాందినీ చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రణాళికలు ఉన్నట్టు సమాచారం అందింది.

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ప్రకారం లష్కర్ ఈ తోయెబా భారీ పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ఢిల్లీ పోలీసు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

Also Read:Tomato:టమోటాతో ప్రయోజనాలు

వీవీఐపీ ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని మోహరించి వాహన తనిఖీలు, పహారా విధులు మరింత కఠినతరం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను పెంచి అనుమానాస్పద కదలికలపై నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

- Advertisement -