పైలట్‌గా మారిన థాయ్‌లాండ్ రాజు

7
- Advertisement -

థాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల భూటాన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం చేపట్టిన ఆయన స్వయంగా బోయింగ్ 737 విమానాన్ని నడిపారు. వృత్తిపరంగా శిక్షణ పొందిన పైలట్ అయిన రాజు, గతంలోనూ పలు సందర్భాల్లో విమానాలు నడిపిన అనుభవం కలిగివున్నారు.

ఈ ప్రత్యేక ప్రయాణంలో ఆయనకు తోడుగా రాణి సుతిదా కో-పైలట్‌గా వ్యవహరించడం విశేషం. ఇద్దరూ కలిసి కాక్‌పిట్‌లో బాధ్యతలు పంచుకుంటూ ప్రయాణాన్ని పూర్తి చేశారు. అధికారిక పర్యటన ముగిసిన తర్వాత ఈ విధంగా స్వయంగా విమానం నడపడం రాజుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రాజభవనం వర్గాలు తెలిపాయి.

ప్రయాణం సందర్భంగా తమ గత జ్ఞాపకాలను స్మరించుకున్నారని సమాచారం. రాజు, రాణి ఇద్దరూ వైమానిక రంగంలో అనుభవం కలిగినవారే కావడంతో ఈ ప్రయాణం వారికి భావోద్వేగ క్షణంగా మారింది. రాజ కుటుంబం సాధారణంగా భద్రతా కారణాల వల్ల ప్రత్యేక ఏర్పాట్లతో ప్రయాణిస్తుండగా, ఈసారి రాజు స్వయంగా పైలట్ అవతారం ఎత్తడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Also Read:Tomato:టమోటాతో ప్రయోజనాలు

- Advertisement -