అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ తాజా గ్లోబల్ టారిఫ్ రీసెట్ నిర్ణయం ప్రకారం భారత ఎగుమతులపై సుంకాలను 18% నుంచి 10%కి తగ్గించింది. ఇటీవల కుదిరిన ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందం కింద 18%కు తగ్గించిన సుంకాలను ఇప్పుడు మరింతగా 10%కు కుదించారు.
ప్రపంచ వాణిజ్య విధానంలో కీలక మార్పుగా భావిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం, 10% గ్లోబల్ టారిఫ్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నింటికీ వర్తిస్తుంది. గతంలో స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, జపాన్ దేశాలకు 15%, వియత్నాంకు 20% సుంకాలు ఉండగా, యునైటెడ్ కింగ్‌డమ్‌పై మాత్రం 10% కొనసాగుతోంది.
ట్రంప్ భారతంతో వాణిజ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించడంలో భారత్ సహకారం అందించిందన్నారు.
అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ అత్యవసర ఆర్థిక అధికారాల వినియోగాన్ని పరిమితం చేసిన నేపథ్యంలో ఈ టారిఫ్ రీసెట్ జరిగింది. అయినప్పటికీ, భారత్‌తో సహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు అమల్లోనే ఉంటాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు లాభదాయకంగా మారి, అమెరికా మార్కెట్‌లో పోటీ సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది.
Also Read:Tomato:టమోటాతో ప్రయోజనాలు

