రివ్యూ: హే సినామిక

165
hey sinamika
- Advertisement -

దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి జంటగా నటించిన చిత్రం ‘హే సినామిక’. కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఈ క్రమంలో మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరికి పెళ్లి అవుతుంది…కానీ తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలని అనుకుంటుంది మౌనా. ఈ క్రమంలో ఓ సైకాలజిస్ట్ డాక్టర్ మలార్ (కాజల్ అగర్వాల్)తో మౌనాకు పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది..?చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ నటీనటులు, టెక్నీషియన్స్‌. దుల్కర్, అదితీ, కాజల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. చేసే పాత్రలో ఒదిగిపోవడం,ప్రేక్షకులను మెప్పించడంలో వారికి ఎవరూ సరిలేరు. మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, రన్ టైమ్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కథ పాతదే అయిన టెక్నీషియన్స్ అద్భుతంగా పనిచేశారు. ఈ సినిమాకు కథను అందించింది ప్రముఖ గీత రచయిత వైరముత్తు తనయుడు మదన్ కార్కీ. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత ప్రతిభావంతులైనా కథ బలంగా లేకపోతే అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఓవరాల్‌గా ప్రేక్షకులను నిరాశపర్చే మూవీ హే సినామిక.

విడుదల తేదీ:3/3/2022
రేటింగ్:2/5
నటీనటులు:దుల్కర్ సల్మాన్,అదితి రావ్ హైదరీ
సంగీతం:గోవింద్‌ వసంతం
నిర్మాత:జియో-గ్లోబల్ వన్ – వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం:బృందా మాస్టర్

- Advertisement -