యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న `హేయ్‌..పిల్ల‌గాడ`

396
fidaa-
- Advertisement -

సాయిపల్లవి, వరుణ్ తేజ్ జంటగా వచ్చిన ‘ఫిదా’ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద రికార్డుల బొనాంజా నెలకొల్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణా యాసలో సాయిపల్లవి ముచ్చట్లకు ఆడియన్స్ దాసోహం అయ్యారు. చిన్నసినిమాగా వచ్చిన ఈచిత్రం భారీకల్లెక్షన్స్ రాబట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈసినిమాకు శక్తికాంత్ కార్తీక్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయింది. ఈయన సంగీత సారథ్యంలో పల్లెటూరు పచ్చిక బయళ్లలో షూటింగ్ చేసిన పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి.

fidaa

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా లోని “హే పిల్లగాడా” అనే పాటను యూట్యూబ్ లో రీసెంట్ గా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 5 లక్షలమంది చూశారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎంతగా పాపులర్ అయ్యిందో. మొన్నటి వరకు ఆంధ్ర అందాలే సినిమాల్లో ఎక్కువగా ఉండేవి కానీ దర్శకుడు తెలంగాణ విలేజ్ లొకేషన్స్ కూడా పాటకు అనువుగా ఉంటాయని ఈ పాత ద్వారా చూపాడు. పాట కొత్తగా అనిపించడంతో ప్రేక్షకులు ఈ వీడియో సాంగ్ ను పదే పదే చూడటానికి ఇష్టపడుతున్నారు. సిందూరీ, సినోవ్ రాజ్ పాడిన ఈ పాటను వనమాలి రాశాడు. పరిస్థితి చూసిన సినీవిశ్లేషకులు.. ఈ పాట ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలుపుతున్నారు.

- Advertisement -