రాక్షసిగా మారిన సన్నీ..

215
- Advertisement -

ప్ర‌ముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది.ఈ అమ్మడు బాలీవుడ్ లో ఐటం సాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది సన్నీ లియోన్.

Sunny Leone Posts Her Most Scary Video

అయితే గత కొంత కాలంగా అమ్మడు ఓ షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటోంది. అందరిని ఆకట్టుకునేలా ఒ సరికొత్త కథాంశంతో రాబోతున్నట్లు ఇదివరకే చెప్పింది. ప్రస్తుతం అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ లు బాగానే జరుగుతున్నాయట. అందుకు సంబంధించిన ఎదో ఒక ఫొటోను సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హల్ చల్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ప్రోస్తేటిక్ తో కనిపించిన విషయం తెలిసిందే. ఆ ఫొటో మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యింది. సన్నీ ఏం చేయబోతోంది అనే కంటెంట్ తో కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే మళ్లీ ఒక చిన్న క్లిప్పింగ్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. అందులో సన్నీ రాకాసి లా కనిపిస్తోంది. చర్మాన్ని చీల్చుతూ.. భయంకరమైన హావభావాలను కనబరిచింది. దీంతో నెటీజన్స్ సన్నీ ఇలా కూడా సెక్సీగా ఉందని ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ అందాల సుందరి భయపెట్టే ఆ సినిమా గురించి ఇప్పుడు చెబుతుందో చూడాలి.

- Advertisement -