మా ఆయన మోడీ బంగారమని తెలిపింది జశోదాబెన్. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై విచారం చేసిన జశోదా…మోడీకి పెళ్లి కాలేదని చెప్పడం సరికాదన్నారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో మోడీనే స్వయంగా తనను పెళ్లి చేసుకున్నట్లు నామినేషన్‌లో తెలిపినట్లు గుర్తుచేసింది. మోడీ బాధ్యతయుతమైన వ్యక్తని…ఆయన తనకు రాముడు లాంటి వారన్నారు.
ఇటీవలె ఓ కార్యక్రమంలో ఆనందీబెన్ మాట్లాడుతూ నరేంద్రమోడీకి వివాహం కాలేదు.ఆయనకు భార్య,పిల్లలు లేనప్పటికీ మహిళలు,పిల్లల బాధను అర్థం చేసుకోగలరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జశోదా…ఆనందీ బెన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆయన భార్య యశోదా బెన్ పటేల్ గురించి అన్ని టీవీ ఛానెల్స్‌లో ప్రచారం జరిగింది. తనకు, మోడీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపింది యశోదాబెన్.