వెండితెరపైకి మరో స్టార్ హీరో కుమారుడు..

224
vijay-and son sanjay jpg
- Advertisement -

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు వెండి తెరకు పరిచయమై వారి సత్తా చూపిస్థున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోల వారసులు వచ్చి వెండితెరపై సందడి చేశారు. ఇప్పుడు వారి వారసులు వచ్చి సందడి చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం అన్ని భాషలలోను స్టార్ హీరోల వారసులు వచ్చి ఓ వెలుగు వెలుగుతున్నారు. తాజాగా తెలుగులో హీరో శ్రీకాంత్ కుమారుడు, డైరెక్టర్ పూరీ తనయుడు వెండి తెరకు పరిచమయిన విషయం తెలిసిందే.

vijay-and son sanjay jpg

ఇక తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు అరంగేట్రం చేస్తున్నాడు. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి రీమెక్ తో వెండితెరకు పరిచయం కానున్నాడు. వర్మ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా మరో తమిళ స్టార్ హీరో తనయుడు వెండితెరకు అరం గేట్రం చేయనున్నాడు. తెలుగు, తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఇప్పుడు ఆయన తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నాడట.

ఇటీవలె ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న సంజయ్, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకునేందుకు కెనడా వెళ్లనున్నాడట. ఆ కోర్స్ పూర్తికాగానే సంజయ్, తండ్రి విజయ్ మాదిరిగా నటన వైపు మొగ్గు చూపుతారా..? లేక వేరి విభాగం వైపు మొగ్గు చూపుతారా..? వేచి చూడాలి ఇక.

- Advertisement -